Human Sacrifice : నల్గొండలో నరబలి వదంతి టెన్షన్.. మహంకాళి కాళ్ల దగ్గర నరికిన తల!

నిన్న ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో...

Human Sacrifice : నల్గొండలో నరబలి వదంతి టెన్షన్.. మహంకాళి కాళ్ల దగ్గర నరికిన తల!

Narabali

Updated On : January 10, 2022 / 9:41 AM IST

Human Sacrifice : నల్గొండ జిల్లాలో నరబలి వార్త సంచలనం రేపుతోంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం దగ్గర మొండెం నుండి వేరు చేసిన తలను అమ్మవారి పాదాల దగ్గర దిమ్మెపై వదలి వెళ్లారు దుండగులు.

ఈ ఉదయం గ్రామస్తులు ఈ మొండం లేని తలను చూసి భయకంపితులయ్యారు. ఈ వార్త దావానలంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను ఆరా తీశారు.

Read More : Hyderabad : కోకాపేటలో మహిళ మృతదేహం లభ్యం

హైదరాబాద్-నాగార్జున సాగర్ స్టేట్ హైవేపై ఈ గ్రామం ఉంది. శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం హైవే రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. ఆ వ్యక్తిని వేరే చోట హత్య చేసి.. తలను మాత్రం విగ్రహం దగ్గర పెట్టి దుండగులు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొండేన్ని మరోచోట వదిలి ఉండొచ్చని భావిస్తున్నారు.

నిన్న ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో స్థానికుల్లో భయాందోళన కనిపిస్తోంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.

Read More : Booster Dose : అర్హులైన వారికి నేటి నుంచి బూస్టర్ డోస్