HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై వేటు.. ఆ ఇద్దరు కూడా సస్పెండ్..
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.

HCA: హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై వేటు పడింది. ఆయనతో పాటు సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ రావ్ ను సస్పెండ్ చేశారు. ఈ నెల 28న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ సీఏ అక్రమాల కేసులో సీఐడీ విచారణ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ సీఏ వ్యవహారాలను హైకోర్టు ఇటీవల సింగిల్ బెంచ్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకి అప్పగించింది. దీంతో ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.
ఒకవైపు హెచ్ సీఏ అవినీతి, అక్రమాలపై సీఐడీ లోతైన్ దర్యాఫ్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు సెక్రటరీ దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ముగ్గురి సస్పెన్షన్ కు సంబంధించి జూలై 28న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అవినీతి, అక్రమాలు, మోసం, నిధుల దుర్వినియోగం, అధికారిక దుర్వినియోగం ఆరోపణలపై హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సి.జె. శ్రీనివాస్ రావులను సస్పెండ్ చేసింది అపెక్స్ కౌన్సిల్. గురువారం అత్యవసర సమావేశం తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ. జగన్ మోహన్ రావును తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో HCAలో టిక్కెట్ల కేటాయింపు, పాలనకు సంబంధించిన అవకతవకలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో జగన్ మోహన్ రావ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. HCA పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మోపిన తీవ్రమైన ఆరోపణలను ప్రాథమిక నివేదిక ధృవీకరించింది. ఇందులో కాంప్లిమెంటరీ టిక్కెట్లు, కార్పొరేట్ బాక్సుల విషయంలో బెదిరింపులు, బలవంతం, బ్లాక్‌మెయిల్ ఉన్నాయి.
HCA మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ (2018) లోని నిబంధనలు 41(6) 15(4)(d) ప్రకారం మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై జగన్ మోహన్ తో పాటు R. దేవరాజ్ (కార్యదర్శి), C.J. శ్రీనివాస్ రావు (కోశాధికారి) కూడా సస్పెండ్ చేయబడ్డారు.
జూలై నెల ప్రారంభంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) జగన్ మోహన్, శ్రీనివాస్, CEO సునీల్ కాంటేతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసింది. వారిపై సెక్షన్లు 465 (ఫోర్జరీకి శిక్ష), 468 (మోసం చేయడానికి ఫోర్జరీ), 471 (నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డును నిజమైనదిగా ఉపయోగించడం), 403 (ఆస్తిని నిజాయితీగా దుర్వినియోగం చేయడం), 409 (ప్రజా సేవకుడు లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత నమ్మక ద్రోహం), 420 (మోసం) భారతీయ శిక్షా స్మృతిలోని 34 (సాధారణ ఉద్దేశ్యం) సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
Also Read: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఏముందోనని బీఆర్ఎస్‌లో కలవరం.. ఏం జరుగుతోంది?