Hyderabad Crime : రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి హత్య వెనుక మట్టారెడ్డి..?!

 హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం కర్ణంగుడా గ్రామసమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు. శ్రీనివాస రెడ్డి హత్య వెనుక మట్టారెడ్డి అనే వ్యక్తి.

Hyderabad Crime : రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి హత్య వెనుక మట్టారెడ్డి..?!

Hyderabad Crime (1)

Updated On : March 1, 2022 / 11:39 AM IST

Hyderabad Realtor Srinivasa reddy murder : హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం కర్ణంగుడా గ్రామ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రియల్టర్ శ్రీనివాస రెడ్డి అక్కడికక్కడే మరణించగా మరో రియల్టర్ రఘురెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాసరెడ్డి హత్య వెనుక మట్టా రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని శ్రీనివాసరెడ్డి వద్ద పనిచేసే హఫీస్ అనే వ్యక్తి తెలిపాడు. శ్రీనివాస రెడ్డిని మట్టారెడ్డి గతంలో బెదిరించాడని దీంట్లో భాగంగా కాల్పలు జరిపి హత్య చేసి ఉంటాడని హఫీజ్ చెబుతున్నాడు.

రియల్డ్ గా వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి కొన్న 20 ఎకరాల భూమిలో తనకు కూడా వాటా ఉందంటూ మట్టారెడ్డి వివాదం సృష్టించాడని నా వాటా నాకు ఇవ్వాలని..గత కొంతకాలంలో మట్టారెడ్డి బెదిరిస్తున్నాడని..తాజాగా సోమవారం (ఫిబ్రవరి 28.2022) మట్టారెడ్డి ఫోన్ చేసి బెదిరించాడని శ్రీనివాస రెడ్డి వద్ద సూపర్ వైజర్ గా పనిచేసే హఫీజ్ చెబుతున్నాడు. మట్టారెడ్డి వనస్థలిపురంలో ఉంటాడని హఫీజ్ తెలిపాడు.

కాగా కర్ణంగూడ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రియల్డర్స్ లపై కాల్పులు జరుపగా ఈ కాల్పుల్లో శ్రీనివాసరెడ్డి మృతిచెందగా..రఘురెడ్డి అనే మరో రియల్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన వ్యక్తిని శ్రీనివాస్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన రియల్టర్‌ను రాఘవేంద్రరెడ్డిగా గుర్తించారు. గాయపడిన రఘురెడ్డిని పోలీసులు వెంటనే బిఎన్ రెడ్డి నగర్ లోని ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చెందిన కారుపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. తనపై కాల్పులు జరిగాయని రాఘవేంద్ర రెడ్డి స్థానికులకు చెప్పాడు. ప్రస్తుతం రాఘవేందర్‌ రెడ్డికి బీఎన్‌ రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది.

రియల్టర్స్‌పై కాల్పులు ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోతగాదాలు సర్వసాధారణమే. దీంట్లో భాగంగానే హత్యలకు ప్లాన్ వేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘురెడ్డి కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.