Hyderabad : అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా..? అలాంటి వారికి బిగ్ షాకింగ్ న్యూస్..

Hyderabad : అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లమీద తిరిగితే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా

Hyderabad : అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా..? అలాంటి వారికి బిగ్ షాకింగ్ న్యూస్..

Hyderabad,

Updated On : November 20, 2025 / 8:54 AM IST

Hyderabad : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రోడ్లు నిత్యం రద్దీగా కనిపిస్తాయి. పగలేకాకుండా.. రాత్రి వేళల్లోనూ రోడ్లపై రద్దీ ఉంటుంది. అర్థరాత్రి పొద్దుపోయే వరకు రహదారుల వెంబడి టిఫిన్ బండ్లు, చాయ్ దుకాణాలు.. హోటళ్ల వద్ద రద్దీ ఉంటుంది. పలు ప్రాంతాల్లో రాత్రంతా దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. ఈ క్రమంలో నగరంలోని చాలా మంది యువత రాత్రివేళల్లో సరదాగా బైకులతో రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. అయితే, అర్ధరాత్రి వేళ ఎలాంటి కారణంగా లేకుండా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు బిగ్ షాకిస్తున్నారు.

Also Read: Nitish Kumar : ఒక్కసారి ఎమ్మెల్యే.. పదోసారి సీఎం.. నితీశ్ కుమార్ స్పెషాలిటీలు ఇవే.. అరుదైన రికార్డు.. దటీజ్ నితీశ్

అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లమీద తిరిగితే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతున్నారని ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టీ కేసులు నమోదు చేసి, యువకులకు మూడు నుంచి ఏడు రోజుల వరకు రిమాండ్ విధించారు. ఇక నుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగకూడదంటూ టోలీచౌకీ పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.