Minister KTR : ఢిల్లీ, గుజరాతీ వాళ్లు తెలంగాణపై దండయాత్ర చేయడానికొస్తే‌ ఊరుకుందమా? మంత్రి కేటీఆర్

తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.

Minister KTR : ఢిల్లీ, గుజరాతీ వాళ్లు తెలంగాణపై దండయాత్ర చేయడానికొస్తే‌ ఊరుకుందమా? మంత్రి కేటీఆర్

Minister KTR (7)

Updated On : November 9, 2023 / 1:18 PM IST

Minister KTR – Gujaraties Come To Invade : కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజీలేని‌ పొరాటం‌ చేస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ దండయాత్రకు‌ వస్తున్నారని తెలిపారు. గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి‌ వస్తే‌ ఊరుకుందమా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చావలేని, చేతగాని వాళ్ళని విమర్శించారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా, కన్నీళ్ళు కావాలా నీళ్ళు కావాలా అని అన్నారు.

కేసీఆర్ కులం, మతం పేరిట కుంపట్లు పెట్టలేదని చెప్పారు. ఎన్నికలు రాగానే కులం, మతం అంటున్నారని తెలిపారు. కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న నాయకులు మనకు‌ అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ వాడు వచ్చి తెలంగాణ మీద దండయాత్ర చేస్తుంటే ఊరుకుందమా అని అడిగారు. తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.

Ponguleti Srinivas Reddy: వారి నుంచి సున్నితమైన వార్నింగ్ లు వచ్చాయి..! ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సిరిసిల్ల నియోజకవర్గం తనకు రాజకీయ బిక్ష ఇచ్చిందని తెలిపారు. సిరిసిల్ల ‌ప్రజల ఆశీర్వాదం తోనే గెలిచి సిరిసిల్లను అభివృద్ధి చేశానని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునేవిధంగా పనిచేశానని పేర్కొన్నారు. ఎలావుండే సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయ్యిందని అడిగారు. రాష్ట్రంలో ‌సిరిసిల్లా అభివృద్ధిలో‌ ముందు ఉన్నామని తెలిపారు.

కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిదేళ్లు‌ మంత్రిగా పని చేశానని చెప్పారు. గౌరవ మెజారిటితో తిరిగి ‌గెలిపిస్తారని తనకు నమ్మకం ‌ఉందన్నారు. తానే క్యాండెట్ అనే విధంగా నాలుగుసార్లు గెలిపించారని పేర్కొన్నారు. ఇంటింటికి‌ ప్రగతి నివేదికలు పంపుతానని చెప్పారు. తాను సిరిసిల్లకి‌ ఏం చేశానో, బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో పరిశీలించాలన్నారు.