CM KCR : కేసీఆర్ దమ్ము ఏంటో ఇండియా మొత్తం తెలుసు
ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి చావు నోట్లో తలపెట్టి సాధించాం. ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే. ఎంతోమంది పిల్లల చావులకు కారణం అయ్యారు. CM KCR

CM KCR Fires On Revanth Reddy
CM KCR Fires On Revanth Reddy : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, సవాళ్లపై విరుచుకుపడ్డారు. కొడంగల్ కు రా అని ఒకడు.. గాంధీ భవన్ కు రా అని ఒకడు.. ఇవేనా సవాళ్లు.. ఇది రాజకీయమా? అంటూ ధ్వజమెత్తారు కేసీఆర్. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితులు రావాలన్నారు.
కేసీఆర్ దమ్ము ఏంటో ఇండియా మొత్తం తెలుసు..
”ఇవాళ మాట్లాడే సిపాయిలు ఆనాడు ఏడ ఉన్నారో అందరికీ తెలుసు. పాలమూరులో గంజి, అంబలి కేంద్రాలు పెట్టినాడు. నా వంతు పోరాటం నేను చేసినా. ఇక ప్రజలే పోరాటం చేయాలి. విధి లేక తెలంగాణ ఇచ్చారు. కొడంగల్, గద్వాల్ లో రైతులు ధర్నా చేస్తున్నారు. కొడంగల్ కు వస్తావా? కొడవలి పట్టుకొస్తవా? అంటున్నారు. కేసీఆర్ దమ్ము సంగతి ఇండియా మొత్తం తెలుసు. ఈ దమ్ము గట్టిగా బయలుదేరితే దుమ్ము లెవ్వదు. నవంబర్ 30న దుమ్ములేవాలె. బీఆర్ఎస్ గెలవాలె.
Also Read : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?
ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే..
నాలుగేళ్లలో 24 గంటల కరెంట్ తెస్తే. కాంగ్రెస్ విడిచిపెట్టి గులాబీ కండువా కట్టుకొని ప్రచారం చేస్తా అని జానారెడ్డి చెప్పాడు. ఆ తర్వాత పారిపోయాడు. రైతుబంధును ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్. తెలంగాణ.. దేశానికి అన్నపూర్ణ అయ్యింది. అచ్చంపేటలో 2లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై 192 కేసులు వేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ కావాలన్నప్పుడల్లా హరిగొస పెట్టారు. ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి చావు నోట్లో తలపెట్టి సాధించాం. ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే. ఎంతోమంది పిల్లల చావులకు కారణం అయ్యారు.
దళితబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్..
భూమి మీద రైతులకు హక్కు ఉండేందుకే ధరణి తెచ్చాం. అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేస్తాం అంటున్నారు. 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ అంటున్నది. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత మాదే. దళితబంధు నెహ్రూ కాలంలో మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉండేది? దళితబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్. ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం. మాకు పోయేది ఏమీ లేదు. నష్టపోయేది ప్రజలే. ఎన్నికల తర్వాత ఒక రోజు అచ్చంపేట కోసం కేటాయిస్తాను” అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read : పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?