Jagga Reddy: ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి పోస్టులు పెట్టడమే దరిద్రమంటే.. ఇది ఇంకా దరిద్రం: జగ్గారెడ్డి

Jagga Reddy: తన ఫేస్ బుక్ పేజీ గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు కీలక విషయాలు తెలిపారు.

Jagga Reddy: ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి పోస్టులు పెట్టడమే దరిద్రమంటే.. ఇది ఇంకా దరిద్రం: జగ్గారెడ్డి

Jagga Reddy

Updated On : May 2, 2023 / 8:09 PM IST

Jagga Reddy: తన అధికారిక ఫేస్ బుక్ పేజీ (Facebook) హ్యాక్ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తెలిపారు. హ్యాక్ చేసి కొందరు రకరకాల పోస్ట్ లు పెడుతున్నారని చెప్పారు. గతంలో కూడా ఇలా హ్యాక్ అయితే ఫిర్యాదు చేశానని అన్నారు.

ఇప్పుడు కూడా సైబర్ క్రైమ్ టీమ్ కు ఫిర్యాదు చేశామన్నారు. తన ఫేస్ బుక్ ఖాతా మళ్లీ హ్యాక్ అయిన్నట్లు తెలిపామని చెప్పారు. ఇలా హ్యాక్ అవ్వడం కూడా తమ బ్యాడ్ లక్ అని జగ్గారెడ్డి అనడం గమనార్హం. “హ్యాక్ చేసి పోస్ట్ లు పెట్టడం ఒక దరిద్రమంటే… ఆ పోస్ట్ పై దరిద్రంగా కామెంట్స్ పెట్టేవాళ్లు ఉంటారు కదా అది ఇంకా దరిద్రం.

ఎవరూ తికమక పడొద్దని చెబుతున్నా. అందదూ గమనించాలని కోరుతున్నాను” అని జగ్గారెడ్డి చెప్పారు. గతంలోనూ జగ్గారెడ్డి పేరిట కొందరు నకిలీ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో డీపీగా ఒక అమ్మాయి ఫొటో పెట్టడం కలకలం రేపింది.

తన పేరును చెడగొట్టేందుకే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని అప్పట్లో జగ్గారెడ్డి మండిపడ్డారు. అప్పుడు కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆ ఫేస్ బుక్ ఐడీ తనది కాదని చెప్పారు. ఇప్పుడు మాత్రం తన సొంత ఫేస్ బుక్ ఐడీనే హ్యాక్ చేశారని జగ్గారెడ్డి అంటున్నారు.

Human Jobs At Risk : మనుషులతో పనిలేదా? వచ్చే ఐదేళ్లలో ఏఐలదే ఆధిపత్యం.. ఆ జాబ్స్ చాట్‌బాట్‌లకే.. ఐబీఎం సీఈఓ ఏమన్నారంటే..?