Jagga Reddy: ఫిరాయింపుల గురించి నేను మాట్లాడలేను.. ఎందుకంటే..?: జగ్గారెడ్డి

రెడ్డి సామాజిక వర్గంలో ఎవరికైనా అవకాశం ఇస్తే పోటీ పడే లిస్ట్ లో తాను ఉంటానని తెలిపారు.

Jagga Reddy: ఫిరాయింపుల గురించి నేను మాట్లాడలేను.. ఎందుకంటే..?: జగ్గారెడ్డి

jagga reddy

ఫిరాయింపుల గురించి తాను మాట్లాడలేనని, ఎందుకంటే తాను కూడా రెండు సార్లు పార్టీ మారానని కాంగ్రెస్ నేత చెప్పారు. పదవుల కోసం తాను కక్కుర్తి పడనని తెలిపారు. ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ అధికారం కోసం ఎన్నడూ అడ్డదారులు తొక్కలేదని చెప్పారు. బీజేపీ మాత్రం పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ అని తెలిపారు. విషయ అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. తాను పీసీసీ పదవి అడగడం కొత్త కాదని, తనకు అవకాశం వచ్చిన ప్రతి సారి అడుగుతానని తెలిపారు.

ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకేనని చెప్పారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎవరికైనా అవకాశం ఇస్తే పోటీ పడే లిస్ట్ లో తాను ఉంటానని తెలిపారు. మన రాష్ట్రం నుంచి మాదిగను రాజ్యసభ సభ్యుడిగా చేసి కేంద్ర మంత్రిగా చేయాలని బీజేపీని ఆ పార్టీ నేతలు అడగాలని అన్నారు.

దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని తెలిపారు.

Also Read: తీహార్ జైల్ నుంచి న్యాయమూర్తికి ఎమ్మెల్సీ కవిత లేఖ.. కీలక అంశాలు ప్రస్తావన.. అవేమిటంటే..?