KA Paul : ఎన్నికల సంఘాన్ని కలిసిన కేఏ పాల్.. మందకృష్ణ మాదిగపై సంచలన వ్యాఖ్యలు
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul
KA Paul Symbol Issue :ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సోమవారం బీఆర్కే భవన్ లోని ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించాలంటూ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు సింబల్ ఇవ్వన్నందుకు హైకోర్టును ఆశ్రయించానని అన్నారు. చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యకత్పుర్ తో పాటు 13 సెగ్మెట్లలో నా అభ్యర్థులు ఉన్నారని పాల్ చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని, దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన వద్దని, ప్రజలంతా కుటుంబ పాలనను తరిమేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : BRS Party: స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయని పాల్ ఆరోపించారు. మందకృష్ణ మాదిగ నరేంద్ర మోదీకి అమ్ముడు పోయాడని, మోదీని ఘోరమైన తిట్లుతిట్టిన ఆయన ఇప్పుడు దేవుడు అంటున్నాడని విమర్శించాడు. మందకృష్ణకు ఒక ఎంపీ ఇస్తానని చెప్పడంతో అమ్ముడు పోయాడని పాల్ ఆరోపించారు. నా పార్టీలో మందకృష్ణను చేరమంటే రూ. 25కోట్లు అడిగాడంటూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగలకు మోదీ ఇన్ని రోజులకు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
Also Read : Fire Broke Out : హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
నరేంద్ర మోదీ బీసీ కాదు, ఆయన సర్టిఫికెట్లు అన్నీ డూబ్లికేట్ అని కేఏ పాల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ నా శిష్యుడని, ఆయనకు నేను భయపడనని పాల్ అన్నారు. అదానీ అప్పులను కట్టకుండా మోదీ మాఫీ చేశాడని విమర్శించారు. తెలంగాణలో మూడు పార్టీలకు ఓట్లు వేయకండి.. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి అంటూ పాల్ వ్యాఖ్యానించారు.