KCR: నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదు: కేసీఆర్

అప్పట్లో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టే స్థాయికి దిగజారారని కేసీఆర్ అన్నారు.

KCR: నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదు: కేసీఆర్

KCR

Updated On : June 22, 2023 / 8:12 PM IST

KCR – Martyrs Memorial: హైదరాబాద్‌లోని తెలంగాణ (Telangana) సచివాలయం సమీపంలో అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. అమ‌ర‌వీరుల‌కు సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ” నా నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలు నన్ను కలిచివేశాయి. సమైక్య పాలనలో ఎన్నో కుట్రలు పన్నారు. చివరకు తెలంగాణపై ప్రకటన చేశారు.

నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదు. తెలంగాణ వచ్చుడో.. నేను చచ్చుడో అన్నట్లు ఉద్యమాన్ని నడిపాను. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చాలా గొప్పది. అమరవీరుల స్థూప నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. అత్యుత్తమంగా నిర్మించాలనుకున్నాం.

అందుకే ఆలస్యం జరిగింది. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం ” అని కేసీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది అని అన్నారు. ఏ సందర్భంలోనూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఉద్యమ సోయి బతికే ఉండాలని భావించారని తెలిపారు.

Gudivada Amarnath: ఆంధ్రలోనే ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చు: కేసీఆర్‌కి ఏపీ మంత్రి కౌంటర్