Kcr On Mlc Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే

క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kcr On Mlc Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే

Updated On : April 18, 2024 / 6:41 PM IST

Kcr On Mlc Kavitha Arrest : తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. రాజకీయంగా కక్ష సాధింపు కోసమే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. కవిత లిక్కర్ స్కామ్ పై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని కామెంట్ చేశారు.

” ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు. మోదీ దుర్మార్గుడు” అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

మరోవైపు ఈ నెల 20వ తేదీ నుండి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 500 రూపాయల బోనస్ కోసం పంట కల్లాల దగ్గర పోరాటాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ సమన్వయంతో పని చేయాలని కేడర్ పిలుపునిచ్చారు గులాబీ బాస్.

Also Read : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?