KCR Resign: కాసేపట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న కేసీఆర్
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేయనున్నారు. ఈ విషయమై గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ కోరింది ప్రగతి భవన్. మరి కాసేపట్లోనే ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి పదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.