Danam Nagender : విచారణకు డెడ్‌లైన్ ముందు సెడెన్‌గా ఢిల్లీలో దానం నాగేందర్.. ఏం జరగబోతుంది..?

Danam Nagender : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు.

Danam Nagender : విచారణకు డెడ్‌లైన్ ముందు సెడెన్‌గా ఢిల్లీలో దానం నాగేందర్.. ఏం జరగబోతుంది..?

Khairatabad MLA Danam Nagender

Updated On : November 20, 2025 / 11:22 AM IST

Danam Nagender : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం.. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనుండటం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన 10మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో.. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ వీరికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎనిమిది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనను వినిపించారు.

అయితే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు విచారణకు హాజరు కాలేదు. అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఒకవేళ విచారణకు హాజరైతే వేటు పడుతుందనే భావనలో దానం నాగేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసేందుకు ఆయన మొగ్గు చూపుతుండగా.. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించేందుకు దానం ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి