Kishan Reddy: ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు: కిషన్ రెడ్డి

ఇంకో రేండు నెలలైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు.

Kishan Reddy: ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు: కిషన్ రెడ్డి

Minister Kishan Reddy

ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించింది. ఇందులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్‌కి భవిష్యత్తు లేదని చెప్పారు.

ఆ పార్టీ ఒక్క సీటు గెలవకున్నా నష్టం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఒడిస్తామని అన్నారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తూ ఆ ఓట్లు వృథా అయినట్లేనని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు. ఇంకో రేండు నెలలైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు.

 Read Also: చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు కీలక భేటీ