Kodandaram : ఇలాంటి ఎన్నికలు చూడటం అదృష్టం.. ప్రజల్లో తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడా తగ్గలేదు : కోదండరామ్
ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమన్నారు.సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు.

Kodandaram
Kodandaram: 1970 ఎమర్జెన్సీలో జరిగిన ఎన్నికలకు 2023 నిన్న జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారని.. తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడ తగ్గలేదనే విషయం ఈ ఎన్నికలల్లో స్పష్టంగా ప్రజల్లో కనిపించిందన్నారు. ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమని, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక వినూత్నమైన తీర్పు అని.. ఈ విషయాన్ని తాను ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాట్లాడటం లేదని.. గ్రౌండర్ లెవల్లో తిరిగాను కాబట్టి చెబుతున్నానని అన్నారు.
నిరంకుశ పాలన రాకుండా చూసుకుంటామని.. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారని.. ఈ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు సహించరని అన్నారు.
Also Read: గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు.. కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..
నాగార్జున సాగర్ వివాదం కోదండరామ్ మాట్లాడుతూ.. సాగర్ జలాల వాటా అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమైనదని విమర్శించారు. చట్టపరమైన విధానాలతో వెళ్ళాలిగానీ ఇలాంటి చర్యలకు పూనుకోకూడన్నారు. ఏపీ నీటి వాటాను వారు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు. కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వం దుందుడుకు ఆలోచనలు సరైనవి కావన్నారు. ఇలాంటి చర్యలు మానుకొని చట్టపరంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నానని అన్నారు. నాగార్జున సాగర్ వాటర్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ వివాదంపై తాము కేంద్ర జల సంఘానికి లేఖా రాస్తామని తెలిపారు.