Konda Vishweshwar Reddy : కమలంలో కలకలం.. ప్రస్తుతం బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సర్వేలు చేశాము. 60శాతం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉందని తేలింది. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy : కమలంలో కలకలం.. ప్రస్తుతం బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Konda Vishweshwar Reddy (Photo : Facebook)

Konda Vishweshwar Reddy – BJP : తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ గెలిచే పరిస్థితి లేదా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకే చెందిన నాయకులు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ పరిస్థితి గురించి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం తమ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారాయన. కొండా చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. అలాగే తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపైనా కొండా స్పందించారు. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

”మేము కొంతమంది నేతలను కలుస్తున్న మాటా నిజమే. మేము పార్టీ మారుతున్నాము అనే మాటలో వాస్తవం లేదు. నేను పార్టీ మారడం లేదు. మేము రెగ్యులర్ గా నాయకులను కలుస్తాం. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. పార్టీని బలోపేతం చేయడం కోసం కొన్ని వ్యూస్ పంచుకున్నాం. పార్టీ ప్రస్తుతం గెలిచే పరిస్థితి లేదు. గెలవడానికి కొన్ని చేయాల్సిన పనులున్నాయి. దీనిపై ప్రకాశ్ జవదేకర్ తో కలిసి మాట్లాడాము.(Konda Vishweshwar Reddy)

Also Read..YS Sharmila : గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ’బీజేపీ రాష్ట్ర సమితి‘ దోస్తానా : వైఎస్ షర్మిల

సర్వేలు చేశాము. 60శాతం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉందని తేలింది. దీనిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. వినియోగించుకున్న పార్టీ గెలుస్తుంది. కేవలం పని చేయడం కాదు. ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరు పని చేయాల్సిన అవసరం ఉంది” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైన బీఆర్ఎస్ ను ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ నాయకులు విశ్వాసంగా ఉన్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా పక్కా ఎగురుతుందని స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ కమలం పార్టీలో కలకలం రేపాయి. కొండా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.(Konda Vishweshwar Reddy)

Also Read..Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?

”నేను కొందరు నేతలు పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. పార్టీ మారడం లేదు. మేము కొంతమంది బీజేపీ నాయకులను కలిశాము. అది నిజమే. అయితే అందరూ అనుకుంటున్నట్లు అందులో సీక్రెట్ ఏమీ లేదు. అందరికీ తెలిసేలా కలిశాము. మేము రెగులర్ గా కలుస్తుంటాము. ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. మేము ఆల్రెడీ బలంగా ఉన్నాము, ఇక ఎన్నికలకు పోవడమే అని కొంతమంది మా పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

కానీ, అది కరెక్ట్ కాదు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అవి చేస్తేనే పార్టీ గెలిచే బలం వస్తుంది. ప్రస్తుతానికి పార్టీకి ఇంకా గెలిచే ఆ బలం లేదు. పార్టీని తప్పక గెలిపించాలని మీటింగ్ జరిగింది. ప్రకాశ్ దేవకర్ అపాయింట్ మెంట్ తీసుకుని కలిశాము. సర్వేల విధానాలు తప్పున్నాయి. వ్యతిరేకత ఎంత ఉంది? అనేది తెలుసుకోవాలి. ఏ వర్గాల్లో ఎంత వ్యతిరేకత ఉంది? అనేది తెలుసుకోవాలి.

వీటిపై నేను, వివేక్ సర్వేలు చేస్తున్నాము. కుటుంబ పాలనను సాగనంపాలని 65శాతం మంది కోరుకుంటున్నారు. ఆ వ్యతిరేకతను ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్లే గెలుస్తారు. కేవలం పని చేయడం కాదు ప్లానింగ్ తో పని చేయాలి. అమిత్ షా కూడా కలుస్తామని చెప్పారు. నేను పార్టీ మారడం లేదు. ఎక్కడికీ పోవడం లేదు. బీజేపీలోనే ఉంటాను” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు.