KTR: రాహుల్‌తో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం..? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

KTR
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు. కాలు గడప దాటదు కానీ ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Gossip Garage : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అందుకే సీరియస్ అయ్యారా?
నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నాయి.. పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్. 39సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుండి సాధించిన పని, తెచ్చిన రూపాయి లేదు అంటూ రేవంత్ ఢిల్లీ టూర్ పై కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి, ఊడితే మాకేంటి. తెలంగాణకు ఒరిగేది ఏమిటి..? అంటూ విమర్శించారు.
Also Read: New Ration cards: కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త..
గ్రామ గ్రామాన, గల్లీగల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అంటూ జనం చివాట్లు పెడుతుంటే చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడలేక పాతగజ్జెలు అన్నట్లు.. హామీల అమలు చేతగాక గాలి మాటలు అంటూ కేటీఆర్ విమర్శించారు.
గురువారం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నాడు. తానేవరో తెలికుండానే పీసీసీ, ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారా? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో తనకు విబేధాలు వచ్చే అవకాశమే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం..? మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి, ఊడితే మాకేంటి. తెలంగాణకు ఒరిగేది ఏమిటి అంటూ కేటీఆర్ అన్నారు.