KTR : వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా?- మంత్రి కేటీఆర్
వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము. KTR

KTR In Sircilla
KTR In Sircilla – CM KCR : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 303 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ”ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించుకున్నాం. సిరిసిల్లకు రావడం తక్కువ అయ్యింది. ఎవరూ తిట్టుకోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం.
Also Read: గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ’బీజేపీ రాష్ట్ర సమితి‘ దోస్తానా : వైఎస్ షర్మిల
365 రోజులు మంచి నీళ్ళు, సాగునీరు, అప్పర్ మానేరులో నిల్వ చేసుకున్నాం. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప ఆలోచనలు చేశారు. రైతుల ఖాతాలో 73 వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత కేసీఆర్ ది. వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము.
Also Read : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?
నేను మందు పోయను, పైసలు పంచను అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల నుండి డబ్బు తెచ్చి ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుంది. డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయండి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ని గెలిపించుకునే బాధ్యత మనదే. జిల్లావ్యాప్తంగా 465 గుడిసెలు, 432 రేకుల షెడ్లు, 907 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. మొత్తం 1,967. వీరందరికీ ఇళ్లు కట్టి ఇస్తాం” అని కేటీఆర్ హామీ ఇచ్చారు.