దేశంలోనే తొలిసారిగా.. టీఎస్ బీ పాస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR launches TS-bPASS: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీ పాస్‌ను ప్రారంభించారు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమే బీపాస్. ఈ విధానంలో 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనానికి ఎలాంటి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 600 గజాలలోపు నివాస గృహాలకు వెంటనే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాసేతర భవనాలకు 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది.
నిర్మాణాల అనుమతి వేగవంతం చేయడంతో పాటు, అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బీ పాస్ అమల్లోకి తెస్తోంది. అన్ని రకాల ఇళ్ల అనుమతులు ఆన్ లైన్ లోనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉండేందుకు టీఎస్ బి పాస్ రూపకల్పన చేశామని ప్రభుత్వం తెలిపింది.