KTR slams Bandi sanjay: అప్పుడు బండి సంజయ్ తంబాకు, లవంగాలు తింటూ తిరిగారు: కేటీఆర్
తాంత్రిక పూజలు, నల్లపిల్లులు, చేతబడులు అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని, తంబాకు, లవంగాలు తింటూ తిరిగారని చెప్పారు. బండి సంజయ్ కి పదవి బిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలేనని అన్నారు. మోదీ, ఈడీ తమ వెంట్రుక కూడా పీకలేవని చెప్పారు.

KTR fires on bandi sanjay over his remarks on KCR
KTR slams Bandi sanjay: తాంత్రిక పూజలు, నల్లపిల్లులు, చేతబడులు అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని, తంబాకు, లవంగాలు తింటూ తిరిగారని చెప్పారు. బండి సంజయ్ కి పదవి బిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలేనని అన్నారు. మోదీ, ఈడీ తమ వెంట్రుక కూడా పీకలేవని చెప్పారు.
తాము వీటికి భయపడమని కేటీఆర్ అన్నారు. శ్రీలంక ప్రధాని చేసిన ఆరోపణలపై మోదీ సమాధానం ఇవ్వాలని నిలదీశారు. కాంట్రాక్టు పొందలేదని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ కోరాలని సవాలు విసిరారు. లేదంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బండి సంజయ్ పై ప్రమాణం చేయాలని అన్నారు. అక్కడ కాదంటే యాదాద్రి ఆలయానికి రావాలని అన్నారు. టీఆర్ఎస్వీ యువత జోరు చూస్తుంటే మునుగోడులో తమ పార్టీ గెలుపు ఖాయంగా కనపడుతోందని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ వదిలిన బ్రహ్మాస్త్రం విద్యార్థి విభాగం అని చెప్పారు. ఒక కాంట్రాక్టర్ బలుపు, అహంకారం వల్లనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్వీ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. మునుగోడులో 5 వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చినట్లే… నల్గొండ అభివృద్ధికి 18 వేల కోట్ల రూపాయలు బీజేపీ ఇస్తే టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని సవాలు విసిరారు.
మిషన్ భగీరథ పథకంతో నల్గొండ ఫ్లోరోసిస్ ను తరిమికొట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,000 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉంటే… స్వరాష్ట్రంలో ఒక్క గ్రామంలో ఫ్లోరోసిస్ లేదని చెప్పారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ మునుగోడు నియోజక వర్గంలోని గుడిమల్కాపూర్ ప్రాంతం అని తెలిపారు.
దేశంలోని 20 ఉత్తమ గ్రామ పంచాయతీలలో 19 తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. గుజరాత్ మోడల్ పైన పటారం.. లోన లోటారంగా ఉందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రైతులు మంత్రులకు తెలంగాణ తరహాలో రైతుబంధు, బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రాంతాలను మనకు కలుపుకునే హక్కు మన చేతిలో లేదని అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..