Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు

రాగల 24 గంటల్లో జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు

Rains

Updated On : July 3, 2022 / 9:24 PM IST

Rains In Telangana :  రాగల 24 గంటల్లో జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించారు.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ వరకు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

గడిచిన 24 గంటల్లో నాగర్‌ కర్నూల్‌, వనపర్తి మినహా అన్ని జిల్లాలో వర్షం కురిసినట్లు టీఎస్‌ డీపీఎస్‌ తెలిపింది. 20కిపైగా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాపాతం నమోదైనట్లు తెలిసింది.

Also Read : PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు