Bhatti Vikramarka: రైతు భరోసాపై ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేశారు: భట్టి విక్రమార్క

పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్‌ పాలనలో ప్రజలు మోసపోయారని తెలిపారు.

Bhatti Vikramarka: రైతు భరోసాపై ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేశారు: భట్టి విక్రమార్క

Updated On : January 5, 2025 / 9:34 PM IST

రైతు భరోసాపై ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తామని తెలిపారు. సాగు చేస్తున్న భూమికి రైతు భరోసా ఇస్తామని చెప్పామని, చెప్పినట్లే చేస్తున్నామని అన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్‌ పాలనలో ప్రజలు మోసపోయారని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాటు గ్రూప్‌-1 పరీక్షను నిర్వహించలేదని చెప్పారు.

మరోవైపు, సివిల్స్ మెయిన్స్ కు అయిన అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమని తెలిపారు. ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తామని చెప్పారు.

గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారని భట్టి విమర్శించారు. తాము సింగరేణిని ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని అన్నారు.

సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పారు.

తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు