Harish Rao: రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ తమిళిసై ప్రవర్తన ఉంది: హరీశ్ రావు
Harish Rao: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు పలు వ్యాఖ్యలు చేశారు.

Harish Rao
Harish Rao: రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రవర్తన ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తమిళిసై సౌందర రాజన్ కనపడలేదు. దీంతో గవర్నర్ ను ఎందుకు పిలవలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
దీనితో పాటు గవర్నర్ వద్ద పెండింగ్ లోని బిల్లులపై హరీశ్ రావు స్పందించారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం అందించాల్సిందేనని రాజ్యాంగంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైళ్ల గురించి ఆయన ప్రస్తావించారు. మరి ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను పిలిచారా అని నిలదీశారు.
అసలు మోదీ వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తాము ఇంతవరకు అడగలేదని హరీశ్ రావు అన్నారు. తమిళిసై సౌందరరాజన్ తీరు బాధకలిగిస్తోందని ఆయన చెప్పారు. బిల్లులను పెండింగ్ లో పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
వైద్య విద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచే బిల్లును ఏడు నెలల పాటు ఎందుకు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు. బిల్లుల విషయంపై తాము సుప్రీంకోర్టు వెళ్తే తప్ప అవి కదిలే పరిస్థితి లేదని చెప్పారు. చిన్న చిన్న సాకులు చూపి గవర్నర్ బిల్లులు ఆపుతున్నారని అన్నారు.
Eatala Rajender: బీజేపీలో చేరడంపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని పొంగులేటి, జూపల్లి అన్నారు: ఈటల