Jupally Krishna Rao : నియంత పాలన పోయింది, చాలా ఆనందంగా ఉంది- మంత్రి జూపల్లి కృష్ణారావు
రాబోయే కాలంలో మా పరిపాలన గత పాలనకంటే భిన్నంగా ఉంటుందన్నారు. స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని వెల్లడించారు. శాఖ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Jupally Krishna Rao Slams KCR (Photo : Google)
తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున ఎంత సంతోషం ఉందో ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జూపల్లి కృష్ణారావు.. సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం కూడా ముఖ్యమే అన్నారు.
తెలంగాణలో నియంత పాలన పోయిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకున్నారు అని మంత్రి జూపల్లి అన్నారు. రాబోయే కాలంలో మా పరిపాలన గత పాలనకంటే భిన్నంగా ఉంటుందన్నారు. స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని వెల్లడించారు. శాఖ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : ఒక్క క్రిమినల్ కూడా లేని ముగ్గురు తెలంగాణ మంత్రులు వీరే..
అగ్నిప్రమాదంపై విచారణ చేయాలని, తొందరగా రిపోర్టు చేయాలని సంబంధిత హెచ్ఓడీని ఆదేశించామన్నారు. తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పాలనను మేము చక్కదిద్దాలని వ్యాఖ్యానించారు. ఏది చేసినా ప్రజా క్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?