Modi Road Show: హైదరాబాద్‭లో ముగిసిన ప్రధాని మోదీ మెగా రోడ్ షో.. ఎలా సాగిందంటే?

గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు

Modi Road Show: హైదరాబాద్‭లో ముగిసిన ప్రధాని మోదీ మెగా రోడ్ షో.. ఎలా సాగిందంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‭లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన భారీ రోడ్ షో ముగిసింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో కాచీగూడ వరకు సాగింది. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీనికి పెద్ద ఎత్తున హాజరై మోదీకి స్వాగతం పలికారు. కాగా, ఈ యాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. మోదీ కాన్వాయ్ వెళ్లే వెంట 25 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికపై ఒక్కొ నియోజకవర్గ అభ్యర్థి ఉండి, మోదీ రోడ్ షోకి తన మద్దతు దారులతో కలిసి స్వాగతం పలికారు.

ఇకపోతే గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకుంది. అయితే కర్ణాటకలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమల పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వరుస ర్యాలీలు నిర్వహిస్తున్నారు.