Mother Suicide: కూతురు చెప్పిన మాట వినడంలేదని తల్లి ఆత్మహత్య: హైదరాబాద్ లో దారుణ ఘటన
కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Police
Mother Suicide: చిన్న విషయాలు, మనస్పర్ధలకే ఆత్మత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చిన్నారుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాల్సిన పెద్దలే ఇటువంటి ఘటనలకు పాల్పడడం విచారకరం. కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..హైదర్‌గూడ ముత్యాలబాగ్, ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో నివసిస్తున్న దంపతుల కుమార్తె స్థానికంగా డిగ్రీ చదువుతోంది. ఈక్రమంలో యువతి కొన్నాళ్లుగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. చదువు పక్కనపెట్టి స్నేహితులతో కలిసి యువతి కాలక్షేపం చేస్తుంది.
ఇదే విషయమై తల్లి పలుమార్లు మందలించింది. తల్లి మాటలను పట్టించుకోని యువతి..తన పంథా మార్చుకోలేదు. కూతురు చెప్పిన మాట వినడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి చెట్టాపట్టాల్.. సినీ ఫక్కీలో అన్న చేజింగ్.. వీడియో వైరల్!