Motkupalli Narasimhulu : బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా

Motkupalli Narasimhulu : బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా

Motkupalli Narasimhulu

Updated On : July 23, 2021 / 12:54 PM IST

Motkupalli Narasimhulu : సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడారు.. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నర్సింహులు.. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపారు.

రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరానన్నారు. అయితే తన అనుభవాన్ని, సుదీర్ఘరాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేకపోయారన్నారు. అందుకే తాను చాలా బాధపడుతున్నానని లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు.

తనకు పార్టీలో ఎటువంటి పదవి దక్కలేదని వాపోయారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోని అవకాశం కల్పించడంలో పార్టీ విఫలమైందని.. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక ఈటలను పార్టీలోకి తీసుకునే సమయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదని.

దళితుల భూములు ఆక్రమించిన ఈటలను పార్టీలోకి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈటల ఎస్సీ వర్గాల భూముల్ని ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నందుకు కనీసం వివరణ కూడా తీసుకోకుండా పార్టీలో చేర్చకున్నారన్నారు. రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే తనను దూరం పెట్టడం బాధకరమన్నారు. పార్టీలో సముచిత స్థానం తక్కకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు.