Munugodu Money : డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్

మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.

Munugodu Money : డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్

Updated On : October 22, 2022 / 11:03 PM IST

Munugodu Money : మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది. కోకాపేట నుంచి మునుగోడుకు తరలిస్తుండగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి అందజేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు.

కోటి రూపాయల నగదును మూడు భాగాలుగా చేసి మూడు కార్లలో దేవల్ రాజ్ అండ్ గ్యాంగ్ తరలిస్తోంది. ఈ క్రమంలో నార్సింగి దగ్గర పోలీసుల తనిఖీలు చూసి దేవల్ రాజ్ అండ్ గ్యాంగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చాకచాక్యంగా వ్యవహరించిన నార్సింగి పోలీసులు దేవల్ రాజ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దేవల్ రాజ్, శ్రీకాంత్, సాగర్, విజయ్, నాగేశ్ ను అరెస్ట్ చేయగా కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య, పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి పరారీలో ఉన్నారు. కోటి రూపాయల నగదుతో పాటు రెండు కార్లు, ఓ బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.