Jupally Rameswar Rao: మోదీతో మైహోం రామేశ్వరరావు, రామురావు భేటీ.. రామును ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన మోదీ 

మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

Jupally Rameswar Rao: మోదీతో మైహోం రామేశ్వరరావు, రామురావు భేటీ.. రామును ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన మోదీ 

MY Home jupally Ramu rao

Updated On : November 8, 2024 / 1:10 PM IST

PM Modi : మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

My Home Group Chairman Jupally Rameshwar Rao Meet PM Modi

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో వీరిద్దరూ ప్రధానితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి రామేశ్వరరావు, రాము రావులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం కలియుగదైవం వేంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను మోదీకి బహుకరించారు. ఈ సందర్భంగా రాము రావును ప్రధాని మోదీ ఆప్యాయంగా హత్తుకొని అభినందించారు.

My Home Group Chairman Jupally Rameshwar Rao Meet PM Modi

అనంతరం రామేశ్వరరావు, రాము రావులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వీరి మధ్య సమావేశం సుమారు గంటపాటు జరిగింది.

My Home Group Chairman Jupally Rameshwar Rao Meet PM Modi

మోదీ, జూపల్లి రామేశ్వరరావుల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

My Home Group Chairman Jupally Rameshwar Rao Meet PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ 2022లో హైదరాబాద్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలు ఉన్న నేతగా ప్రధాని మోదీకి గుర్తింపు ఉంది. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసే నాయకుడిగా పేరు పొందారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు రాజకీయంగా ప్రధాని మోదీ.. మొదటి స్థానంలో నిలవడంతో పాటు ప్రపంచంలో బలమైన నాయకుడిగా ఎదిగారు.

My Home Group Chairman Jupally Rameshwar Rao Meet PM Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి రాము రావుల భేటీ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.