బీఎస్పీకి నీలం మధు రాజీనామా.. 15న కాంగ్రెస్‌లో చేరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

బీఎస్పీకి నీలం మధు రాజీనామా.. 15న కాంగ్రెస్‌లో చేరిక

neelam madhu mudiraj quit bsp and set to join congress in telangana

Neelam Madhu Mudiraj: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ నెల 15న గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీప్‌దాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నీలం మధు వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంతో ఆయన బీఎస్పీలో చేరారు. నీలం మధు బీఎస్పీ తరపున పోటీ చేసి 46 వేల ఓట్లు సాధించారు.

కాగా, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పటాన్‌చెరు టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్ ముందుగా నీలం మధుకు కాంగ్రెస్ కేటాయించింది. అయితే స్థానిక నాయకుడు కాటా శ్రీనివాస్ గట్టిగా పట్టుబట్టడంతో ఆయనకే బీఫామ్ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన నీలం మధు బీఎస్పీలో చేరి.. ఎన్నికల్లో పోటీ చేశారు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లవ్‌స్టోరీ ఎలా మొదలైందో తెలుసా.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఎమ్మెల్యే