జనసేనతో పొత్తు లేదు, తేల్చి చెప్పిన బీజేపీ

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 02:26 PM IST
జనసేనతో పొత్తు లేదు, తేల్చి చెప్పిన బీజేపీ

Updated On : November 19, 2020 / 2:50 PM IST

no alliance with janasena: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని బీజేపీ తేల్చేసింది. 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది.




పొత్తుకి సంబంధించి బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎలాంటి ప్రతిపాదన రాలేదని బండి సంజయ్ అన్నారు. ఇద్దరం కలిసి పని చేసే అవకాశాలు లేవన్నారు. 150 డివిజన్లకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాము, బీఫామ్ లు కూడా సిద్ధం చేసుకున్నామని, ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో బీఫామ్ లు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు బండి సంజయ్.

డిసెంబర్‌ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే డివిజన్ల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్‌ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన. నవంబర్‌ 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
https://10tv.in/bjp-state-president-bandi-sanjay-fires-over-cm-kcr/
గ్రేటర్‌ ఎన్నికలు:
* డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
* మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్‌ పేపర్లు సెపరేటు
* మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
* ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్‌ డిపాజిట్‌
* ఇతర అభ్యర్థులకు రూ.5000 నామినేషన్‌ డిపాజిట్‌
* రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
* 48వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ
* తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం
* మొత్తం 2,700 పోలింగ్‌ కేంద్రాలు
* 1439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,004
* అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 257




జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు
* గ్రేటర్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌
* బీసీ -50: (జనరల్‌ 25, మహిళలు 25)
* ఎస్సీ -10: (జనరల్‌ 5, మహిళలు 5)
* ఎస్టీ-2: (జనరల్‌ 1, మహిళ 1)
* జనరల్‌ -44
* జనరల్‌ మహిళ -44