Rajagopal Reddy : బీఆర్ఎస్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యం : రాజగోపాల్ రెడ్డి
ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు.

Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy : బీఆర్ఎస్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాము పదవుల కోసం రాలేదు.. తమ స్వార్ధం కోసం రాలేదని తెలిపారు. స్వార్థం కోసమో.. పదవుల కోసమో.. లావాదేవీలు జరిపేందుకో పార్టీలోకి రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతోనే బీజేపీలో చేరామని తెలిపారు. జేపీ నడ్డా, అమిత్ షాతో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి,కిషన్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటకు పైగా సమావేశం కొనసాగింది.
తెలంగాణలో బీజేపీ పరిస్థితులను, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలను అమిత్ షా, జేపీ నడ్డాకు ఈటల, రాజగోపాల్ రెడ్డి వివరించారు. కేసీఆర్ అవినీతి పాలన అంతమొందేందుకు చర్యలు తీసుకోవాలని ఈటల, రాజగోపాల్ రెడ్డి అధిష్టానానికి తేల్చి చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి సంపూర్ణ సహకారం అందించడానికి ఈటల, రాజగోపాల్ కి అధిష్టానం సూచనలు చేసింది. కేసీఆర్ అవినీతి పాలన ఎదుర్కొనేందుకు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఈటల, రాజగోపాల్ రెడ్డి అధిష్టానానికి సూచించారు.
అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తాము కష్టపడుతున్నామని. తమ విషయాలు వినండి అని అధిష్టానానికి చెప్పామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుల అందరి అభిప్రాయాలు అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ మెత్తబడింది అన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు ఏం చేస్తే బలపడతాము అన్న అంశంపై చర్చ జరిపామని తెలిపారు.
అధిష్టానం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు. కుటుంబ పాలన, దోపిడీ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంలో తమ అభిప్రాయం వెల్లడించామని పేర్కొన్నారు.
Vinod Kumar : మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పందించి.. ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలి : వినోద్ కుమార్
కర్ణాటక ఫలితాల తర్వాత కొంత మాట్లాడుతున్నప్పటికీ, ప్రజలకు మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తాము చెప్పినట్టుగా ముందుకెళ్తే ఇప్పటికైనా ప్రజలు బీజేపీ వెంట నిలిచి, బీఆర్ఎస్ ను గద్దె దించడం ఖాయమన్నారు. అమిత్ షా చాలా గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో పోరాటం ఎలా ఉండాలన్న విషయంపై ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.
తమ లక్ష్యం కుటుంబ పాలన అంతం కావడమేని.. తమకు వ్యక్తిగతంగా ఏ పదవులు అవసరం లేదు… తాము కోరుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడం గురించే ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని సూచనలు చేశామని తెలిపారు. తమ సూచనలను అమిత్ షా, నడ్డా శ్రద్ధగా విన్నారని తెలిపారు.