GHMC ఎన్నికల్లో ’ముగ్గురు పిల్లల నిబంధన’పై హైకోర్టులో పిటిషన్

GHMC elections : ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీధర్ బాబు, మహ్మద్ తారీఖ్ వేసిన వ్యాజ్యాలపై గురువారం (నవంబర్ 12, 2020) కోర్టు విచారణ జరిపింది.
మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లలను మించి ఉన్నా పోటీకి అనర్హులుగా చేస్తూ ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేసిందని కోర్టులో పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. జీహెచ్ఎంసీలో మాత్రం అనర్హులుగా పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ఇక వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.