సీఎం కేసీఆర్ చెప్పినా జర్నలిస్టులపై పోలీసులు దాడులు.. ఐడీ కార్డు చూపించినా బూతుల తిడుతూ..
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
తెలంగాణలో పోలీసుల తీరు మారడం లేదు. మీడియా ప్రతినిధుల పట్ల ఖాకీలు తమ ధోరణిని విడనాడటం లేదు. జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఆంక్షల నుంచి మీడియా ప్రతినిధులకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా.. ఖాకీల తీరు మారడం లేదు. మీడియా ప్రతినిధులను ఇబ్బంది పెట్టవద్దని, విధులకు ఎలాంటి ఆటంకం కల్గించవద్దని స్వయంగా సీఎం ఆదేశించినా పోలీసుల చెవికెక్కడం లేదు. వరుస పెట్టి జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
కరోనా వైరస్ వార్తల కవరేజ్ కు సంబంధించి విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మంగళవారం (మార్చి 24, 2020) రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టును హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద పోలీసులు చుట్టి ముట్టారు. లాఠీలతో చితకబాదారు. ఐడీ కార్డు చూపించిన వినిపించుకోలేక అసభ్యపదజాలంతో, బూతులు తిడుతూ దాడి చేశారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ జర్నలిస్టులపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించిన విషయంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ ఆ విషయంపైన రాద్ధాంతం కొనసాగింది. ఐడీ కార్డు చూపించినా కూడా జర్నలిస్టులపై పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగడంతోపాటు నిర్బంధంగా వారిపై దాడి చేస్తున్న సందర్భాలున్నాయి.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిన విషయం పట్ల జర్నలిస్టులపై దాడులు చేయొద్దని నేరుగా ప్రెస్ మీట్ లో నే చెప్పారు. వారు ఉద్యోగం చేసేది ప్రజల కోసమే, కచ్చితంగా మీడియాకు మినహాయింపు ఉంది. ప్రభుత్వం తరపున విడుదల చేసిన జీవోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశామని చెప్పారు. అయినప్పటికీ జర్నలిస్టులపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.
ఇవాళ విధులు నిర్వహించుకుని దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్తున్న మీడియా ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఐడీ కార్డు చూపించినప్పటికీ దాడి చేశారు. రాత్రిళ్లు లేట్ హవర్స్ లో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తుంటారు. ఐటీ కార్డు చూపించినప్పటి కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. పోలీసు డిపార్ట్ మెంట్ లోని కిందిస్థాయి సిబ్బంది జర్నలిస్టులపై దాడులు చేస్తున్న సందర్భాలు చాలా సార్లు ఎదురవుతున్నాయి.
మీడియాకు మినహాయింపు ఉందని నేరుగా సీఎం క్లారిటీ ఇచ్చినా తర్వాత కూడా పోలీసులు మీడియా ప్రతినిధులపై వరుసుగా దాడులు చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనపై పట్ల సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్…జర్నలిస్టులపై దాడులు నిర్వహించవద్దు..వారికి మినహాయింపు ఉంది..వారి విధులకు ఎలాంటి ఆటకం కలిగించకుండా పోలీసులు చూడాలని చెప్పినా కూడా పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తోంది.
మీడియా ప్రతినిధులపై వరుసుగా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు దిల్ సుఖ్ నగర్ లో మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.