టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి.. బీజేపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

trs mla kranthi kiran attack: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై జరిగిన దాడి ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం(నవంబర్ 2,2020) రాత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు దాడి చేశారు. ఎమ్మెల్యే ఉన్న గదిలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేశారు. దాడి ఘటనపై అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, పత్రి శ్రీనివాస్ యాదవ్, అనిల్, ఉమేష్‌లతో పాటు మరికొంత మందిపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దాడి, బెదిరింపులతో పాటు కోవిడ్ సెక్షన్ల కింద బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.