Raghunandan Rao: ఆ ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి కేసీఆర్ వెనకేసుకొస్తున్నారు: ఎమ్మెల్యే రఘునందన్

Raghunandan Rao: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Raghunandan Rao: ఆ ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి కేసీఆర్ వెనకేసుకొస్తున్నారు: ఎమ్మెల్యే రఘునందన్

Raghunandan Rao

Updated On : April 28, 2023 / 4:26 PM IST

Raghunandan Rao: తప్పు చేసిన మంత్రులను మందలించాల్సింది పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. “దారినపోయిన దానయ్య మాట్లాడితే మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు” అంటూ కేసీఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు.

“నేను కూడా కేసీఆర్ కంటే ఎక్కువగా మాట్లాడగలను. మీరు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యేనే.. అదృష్టం బాగుండి మీరు సీఎం అయ్యారు అంతే. నేను మాట్లాడాలి అంటే అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలను. అప్పట్లో దళిత ఉప ముఖ్యమంత్రిని ఎలాంటి కారణాలు చెప్పకుండా తీసివేశారు.

మరో బీసీ బిడ్డపై రాత్రికి రాత్రే ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మంత్రి పదవి నుంచి తీసి వేశారు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? దళిత బంధులో అవినీతి చేసిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలి. వారి మీద సీబీఐ దర్యాప్తు అదేశించే దమ్ము ఉందా? ముఖ్యమంత్రే చెబుతున్నారు ఎమ్మెల్యేలు అవినీతి చేశారు అని.

ఎమ్మెల్యేల అవినీతి మీద సిట్ వేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? గజ్వేల్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలలంటే డబ్బులు అడుగుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి. ఎస్సీ, బీసీ మంత్రులకు ఒక న్యాయం అగ్రవర్ణ మంత్రులకు మరో న్యాయమా? వ్యవసాయ మంత్రి మీద విచారణ జరిపించాలి.

పేపర్, మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకోవాలని నాయమూర్తులను కోరుతున్నాను. దళిత బంధులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయం సామాన్యులకు అనుకూలంగా ఉండాలి. చెంచల్ గూడ జైలు లాగా పాస్ లు, స్కానర్లు ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని హరీశ్ రావు అంటున్నారు. ఎస్టీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) నిధులు ఎవరివి?” అని ప్రశ్నించారు.

Joe Biden..Trump : బైడెన్‌ను అనుకరిస్తు హేళన చేసిన ట్రంప్ ..