DK Aruna: డీకే అరుణతో భేటీ.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి?

గతంలో రంగారెడ్డి వైఎస్సార్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది.

DK Aruna: డీకే అరుణతో భేటీ.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి?

DK Aruna - Rangareddy

Updated On : June 12, 2023 / 6:01 PM IST

DK Aruna – Rangareddy: బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి సమావేశమయ్యారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డితో పాటు మరికొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.

గతంలో రంగారెడ్డి వైఎస్సార్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన షర్మిలతో సమావేశం అయ్యారు. అయితే, మర్యాద పూర్వకంగానే తాను షర్మిలను కలిసినట్లు ఆయన అప్పట్లో తెలిపారు. షర్మిలతో రంగారెడ్డి భేటీ వెనుక రాజకీయ అంశాలే ఉన్నాయని ప్రచారం జరిగింది.

ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండడంతో నేతలు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం నిండింది. కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తుంటే, మరికొందరు బీజేపీలో చేరాలని నిర్ణయాలు తీసుకుంటుండడం గమనార్హం.

Telangana Politics : తెలంగాణ అడ్డాలో బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టే మొనగాడు ఎవరు.. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్.. కొత్త టీంతో బీజేపీ?