Revanth Reddy Condolence : రోడ్డు ప్రమాదంలో వేం పురుషోత్తం రెడ్డి మృతి.. రేవంత్ రెడ్డి సంతాపం

మంచి మిత్రుణ్ణి కోల్పోయానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Revanth Reddy Condolence : రోడ్డు ప్రమాదంలో వేం పురుషోత్తం రెడ్డి మృతి.. రేవంత్ రెడ్డి సంతాపం

Revanth Reddy (4)

Updated On : May 27, 2023 / 9:20 PM IST

Vem Purushottam Reddy Death : మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వేం పురుషోత్తం రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన కుటంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. మంచి మిత్రుణ్ణి కోల్పోయానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Nandamuri Lakshmi Parvati : ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు వల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు : నందమూరి లక్ష్మి పార్వతి

గీసుగొండ మండ‌లం గంగదేవిపల్లి సమీపంలో కారు, బస్సు ఢీకొన‌డంతో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తంరెడ్డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. రేవంత్ రెడ్డి రేపు(ఆదివారం) వరంగల్ కు వెళ్లి వేం పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.