Erra Shekar : కాంగ్రెస్‌కు షాక్.. అనూహ్యంగా కారు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడు ఎర్ర శేఖర్. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే కూడా. ఎర్ర శేఖర్ కు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కనిపిస్తోంది. Erra Shekar

Erra Shekar : కాంగ్రెస్‌కు షాక్.. అనూహ్యంగా కారు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే

Erra Shekar Joins BRS

Updated On : October 29, 2023 / 4:51 PM IST

Erra Shekar Joins BRS : మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి ఎర్ర శేఖర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ఎర్ర శేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో తనకు అనుబంధం ఉందని ఎర్ర శేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి చేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఎర్ర శేఖర్ చెప్పారు. ముదిరాజ్ ల అభివృద్ధికి తన వంతు కృష్టి చేస్తానని ఎర్ర శేఖర్ చెప్పారు.

మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడు..
మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడు ఎర్ర శేఖర్. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే కూడా. కొంత బలమైన సామాజిక నేపథ్యం, సామాజికవర్గం ఉంది. ఆయనక జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే, జడ్చర్ల కుదరలేదు. అక్కడ అనిరుధ్ రెడ్డికి ఇచ్చారు. అయితే, ఎర్ర శేఖర్ ను నారాయణపేట్ కు పంపుతామని హామీ ఇచ్చారు. కానీ, అక్కడా టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ ను వీడి.. బీఆర్ఎస్ లో చేరారు.

Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఆమె ఏమన్నారంటే..

ఎర్ర శేఖర్ కు ఎమ్మెల్సీ పదవి?
గతంలో కేసీఆర్ తో కలిసి టీడీపీలో పని చేసిన సందర్భాన్ని ఎర్ర శేఖర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ తో కలిసి పని చేశారాయన. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ తో కలిసి పని చేసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎర్ర శేఖర్. ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఎర్ర శేఖర్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. మొత్తంగా ఎర్ర శేఖర్ కు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కనిపిస్తోంది.

Also Read : కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు, అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తాం- రేవంత్ రెడ్డి

ఈటల స్థానంలో ఎర్ర శేఖర్ కు ప్రాధాన్యం..
ఇదే సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసేవారు. రెండు దఫాలుగా ఆయన మంత్రిగా ఉన్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఎర్ర శేఖర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలకు ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి మంత్రి కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ లో చేరడం ఆసక్తికరంగా మారింది. ఎర్ర శేఖర్ ఒక్కరే కాదు మహబూబ్ నగర్ నుంచి మరో సీనియర్ నేత, నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్న నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం. మంత్రి కేటీఆర్.. నాగంను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.