Fire Accident Six Burnt Alive : మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Fire Accident Six Burnt Alive : మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం

Six burnt alive

Updated On : December 17, 2022 / 7:25 AM IST

Fire Accident Six Burnt Alive : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఇంటి యజమాని శివయ్యతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

మృతుల్లో నలుగురి వయస్సు 50, 35 సంవత్సరాలు. మిగిలిన ఇద్దరిలో హిమబిందు(2), స్వీటి అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది రప్పించి మంటలార్పారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Fire In Bus : ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, భయంతో దూకేసిన ప్రయాణికులు

ప్రమాదానికి షార్ట్ సర్య్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, మందమర్రి సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రమోద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.