SLBC Tunnel Mishap : విపరీతమైన బురద, నీరు.. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్.. SLBC టన్నెల్ లో కార్మికులను కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు..
ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీమ్ తెప్పలు, టైర్లు, థర్మకోల్ వినియోగిస్తున్నారు.

SLBC Tunnel Mishap : ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ప్రత్యేక టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సిబ్బందితో కూడుకున్న రెస్క్యూ టీమ్ సొరంగంలోకి వెళ్లింది.
ఈ టీమ్ కార్మికులకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, లోపల విపరీతంగా బురద, నీరు ఉండటంతో రెస్క్యూ సిబ్బంది అందులో కూరుకుపోయినట్లు సమాచారం. ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీమ్ తెప్పలు, టైర్లు, థర్మకోల్ వినియోగిస్తున్నారు. మరో రెండు గంట్లలో రెస్క్యూ టీమ్ కార్మికుల దగ్గరికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పై భాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
3 మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 50 మంది ఉండగా.. అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు.
Also Read : గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అంగన్‌వాడీల్లో కొలువుల జాతర.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
దాదాపు 36 గంటలుగా వారు టన్నెల్ శిథిలాల కిందే ఉన్నారు. అటు సమయం గడుస్తున్న కొద్దీ లోపల కార్మికుల పరిస్థితి ఏంటి అనేదానిపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది. సంఘటన స్థలం దగ్గరే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించిన 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read : బాబోయ్.. బాంబులా పేలిన బెలూన్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భయానక ప్రమాదం.. బీకేర్ ఫుల్..
టన్నెల్ లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరగ్గా.. 12 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా మార్గం ఉంది. అక్కడి నుంచి మోకాలి లోతు నీరు, బురద రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారాయి. బురదను దాటేందుకు థర్మాకోల్ షీట్స్, ట్యూబ్స్ వాడుతున్నారు రెస్క్యూ సిబ్బంది.
దాదాపు 300 మందికి పైనే టీమ్స్ గా ఏర్పడి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరంతా టన్నెల్ లోపలికి వెళ్లారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, కార్మికుల వద్దకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. దాదాపు 35 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో అధికార యంత్రాంగంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టన్నెల్ లో బురద, వరద నీరు భారీగా చేరింది. దాంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. థర్మాకోల్ షీట్స్ సాయంతో రెస్క్యూ సిబ్బంది చాలా నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్నారు. కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం వద్దకు చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్ లోపల యంత్రాలు విరిగిపడ్డాయి.
వాటి మధ్య నుంచి అతి జాగ్రత్తగా రెస్క్యూ సిబ్బంది ఒక్కొక్కరిగా ముందుకు కదులుతున్నారు. భారీగా పేరుకున్న బురద, వరద నీరు.. తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్లేందుకు ఇవన్నీ ఆటంకాలుగా మారాయి. వాటన్నింటిని అధిగమించుకుంటూ నెమ్మది నెమ్మదిగా సహాయక సిబ్బంది ముందుకు సాగుతున్నారు.