Yadadri : మే2 నుంచి యాదాద్రిలో శ్రీనృసింహ జయంతి ఉత్సవాలు
ఉత్సవాల్లో విశేషంగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం జరిపిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం అలంకార వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు.

Yadadri
Yadadri : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మే2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీనృసింహ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మొదటి రోజు స్వస్తీ వాచనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. చివరి రోజు నృసింహ ఆవిర్భావంతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 25)న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్సవాల్లో విశేషంగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం జరిపిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం అలంకార వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
CM KCR Yadadri : యాదాద్రిలో సీఎం కేసీఆర్.. స్వామి వారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ
ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరిస్తామని చెప్పారు. ఉత్సవాల్లో పాల్గొనే అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశామని పేర్కొన్నారు. వేసవి సెలవులు కావడంతో శ్రీస్వామి వారి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.