తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
Gaddam Prasad Kumar (Image Credit To Original Source)
- ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణల కేసు
- సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదని పిటిషన్లు
- సమాధానం చెప్పాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేఎఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లకు సుప్రీంకోర్టు జత చేసింది.
తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: మీకు బుద్ధి ఉంటే ఒక్కసారి ఆలోచించండి: రేణూ దేశాయ్ ఆగ్రహం
దీంతో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని గడ్డం ప్రసాద్‌కు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. అన్ని పిటిషన్లపై విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
కాగా, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ సుప్రీంకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదని విపక్ష నేతలు అంటున్నారు.
