Resignations : బీఆర్ఎస్ ఓటమితో రాజీనామాల పర్వం.. ఇంటెలిజెన్స్ ఐజీ, టాస్క్‌ఫోర్స్ OSDలు రాజీనామా

ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు.

Resignations : బీఆర్ఎస్ ఓటమితో రాజీనామాల పర్వం.. ఇంటెలిజెన్స్ ఐజీ, టాస్క్‌ఫోర్స్ OSDలు రాజీనామా

Resignations (Photo : Google)

బీఆర్ఎస్ ఓటమితో రాజీనామాల పర్వం మొదలైంది. పలువురు అధికారులు తమ పదవులకు రిజైన్ చేస్తున్నారు. తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రభుత్వానికి పంపారు రాధాకిషన్ రావు. మూడేళ్ల క్రితం తన పదవీ కాలం ముగిసినా టాస్క్ ఫోర్స్ లోనే కొనసాగుతున్నారు రాధా కిషన్ రావు. ఇటీవలే ఎన్నికల విధుల నుండి రాధాకిషన్ రావును ఎన్నికల కమిషన్ తొలగించింది.

మూడేళ్ల క్రితమే రిటైర్ అయినా..
అటు ఇంటెలిజెన్స్ ఐజీ పదవికి ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేసేశారు. తన రాజీనామాను ప్రభుత్వానికి పంపారాయన. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కు ఓఎస్డీగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తన పదవిని ఆయన వదిలుకున్నారు. మూడేళ్ల క్రితమే ప్రభాకర్ రావు రిటైర్ అయ్యారు. అయితే కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయనను యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ వింగ్ అధికారిగా నియమించారు. కాగా, ప్రభాకర్ రావు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని ఆరోపణలు చేశారు.

Also Read : టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరనుంది. ఈ క్రమంలో పలువురు అధికారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

ప్రభుత్వం మారడంతో రాజీనామాల పర్వం..
అటు తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు సైతం తన పదవికి రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం గమనార్హం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు.

Also Read : కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై వెంటకరమణా రెడ్డి గెలుపుకు కారణాలివే

ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, అప్పటి టీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకున్నారు.