Teenmar Mallanna: ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని వివాదం చేయాలని చూస్తున్నారు: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసుతిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని తీన్మార్ మల్లన్న చెప్పారు.

Teenmar Mallanna: ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని వివాదం చేయాలని చూస్తున్నారు: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పలు విషయాలు తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని కూడా వివాదం చేయాలని కొందరు చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఈ సమావేశాన్ని శుభసూచకంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

విభజన హామీల్లో పరిష్కారంకాని అంశాలపై పరిష్కారం కోసం చర్చ జరుగుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉందో ప్రజలకు అర్థం అవుతోందని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమవుతుంటే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ కు, ఆయన పరివారానికి నచ్చడం లేదని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కారు మభ్యపెట్టినట్లే ఇప్పుడు కూడా అదే విధంగా పాలన జరగాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, జగన్ పదేళ్ల పాటు స్వార్థ రాజకీయాలు తప్ప సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపలేదని ఆరోపించారు.

Also Read: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఆఫీసులకు మూడిందా.. అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గతా?

ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసుతిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని తీన్మార్ మల్లన్న చెప్పారు. సీఎంగా కేసిఆర్ ఉన్నప్పుడే 7 మండలాలను ఆంధ్రలో కలిపారు కదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తుందని చెప్పారు.