Telangana Assembly Session 2023: అసెంబ్లీ నిరవధిక వాయిదా.. Live Updates
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులకు ఆమోద ముద్ర పడింది.

Telangana assembly session
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సహా పలువురు సభ్యులు ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
LIVE NEWS & UPDATES
-
పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
పురపాలక చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. కేసీఆర్ మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. సభ నిరవధిక వాయిదా పడింది.
-
ఆర్టీసీ విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ అధీనంలోనే ఉంటాయని స్పష్టతనిచ్చారు.
-
ఆర్టీసీ విలీనం బిల్లును ప్రవేశపెట్టిన పువ్వాడ
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును మంత్రి పువ్వాడ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
మరోవైపు, అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. దేశమే ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలోని ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని ప్రకటించారు.
-
తెలంగాణ నంబర్ వన్..
అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలుగా ఉందని, ఏపీ తలసరి ఆదాయం రూ.2.19 లక్షలు మాత్రమేనని తెలిపారు.
-
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ముంచింది..
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ముంచిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, ఆ తర్వాత సాధించిన ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఒక రోజు పోరాటంతోనో, ఒక నాయకుడి వల్లో వచ్చింది కాదని అన్నారు.
-
మరో 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.
-
అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క
-
తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదించింది.
-
అసెంబ్లీలో ప్రొపెసర్ జయశంకర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్..
-
అసెంబ్లీరాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇక సభకు వస్తానోరానో తెలియదు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ధూల్‌పేట్ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండాలంటూ రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు.
-
కళ్లకలకపై మండలిలో మంత్రి హరీష్‌రావు ఏం చెప్పారంటే..
శాసనమండలిలో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కళ్లకలకపై చేసిన సూచనకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు.కళ్లకలకపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో కళకలకపై సమీక్షించడం జరిగిందని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో ఐ డ్రాప్స్, ఆయింట్‌మెంట్స్, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కళ్లకలక సోకకుండా ప్రజలుసైతం వ్యక్తిగత శుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కళ్లకలక నేరుగా గాలి ద్వారా వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉన్నచోట చేతులు తగలడం, ఒకే దగ్గర పడుకోవటం, కర్చీఫ్‌లు ఎక్చేంజ్ చేసుకోవటం, పలు కారణాల వల్ల ఈ కళ్లకలక వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కళ్లకలక వచ్చినా ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రికి వెళితే అందుకు సంబంధించిన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని మంత్రి చెప్పారు.
-
ఆర్టీసీ విలీనం బిల్లును రాజకీయాలకు వాడుకుంటున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గవర్నర్ కోరిన క్లారిటీ అంశాలను సీఏస్ ద్వారా వివరణఇస్తే బెటర్ అని, గవర్నర్ సీఎస్‌ను పిలిచి వివరణ కోరవచ్చు అని అన్నారు. గవర్నర్ అడ్డు చెప్పడం వల్లే ఆర్టీసీ విలీనం కావట్లేదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఏస్‌ను పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలి.
-
ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే బిల్లును స్పీకర్ అనుమతితో టేబుల్ చేసే యోచనలో సర్కార్. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
-
ఎన్నికల ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో సీఎం కేసీఆర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆర్టీసీ విలీనం బిల్లు ఎజెండాలోనే లేకపోవటం గమనార్హం.
-
శాసనసభ, మండలిలో ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’ పై చర్చ జరుగుతుంది. ఇదిలాఉంటే ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చలో పాల్గొననున్నారు.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల తమ పాలనలో సాధించిన ప్రగతి పై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు.
-
శాసన మండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. .
రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని.
శాసనసభ లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ..
రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు ఇళ్ళు ఇస్తానన్న ప్రభుత్వ తన హామీని నెరవేర్చడంలో విఫలమైందని..
-
శాసనమండలిలో రెండు కీలక పేపర్స్ టేబుల్ చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టుని టేబుల్ చేయనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రాన్స్‌పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన పేపర్స్ ను టేబుల్ చేయనున్నారు.
-
శాసన మండలి, శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు.
-
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి.