Amit Shah : ఈనెల 21న అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం
తెలంగాణకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 21 న సమావేశం కానున్నారు.

Telangana Bjp Leaders Meet Amit Shah
Amit Shah : తెలంగాణకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 21 న సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వారు అమిత్ షాతో చర్చించనున్నారు.
Also Read : Snake Funerals : పాముకు అంత్యక్రియలు నిర్వహించిన దుర్గగుడి అర్చకులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలను రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అమిత్ షాతో బేటీకీ తీసుకు వెళ్లనున్నారు. గతవారమే అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినప్పటికీ రావత్ మరణంతో ఆ సమావేశం వాయిదా పడింది. ఇటీవల తెలంగాణ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. ఇప్పుడ అమిత్ షాతో ప్రజా ప్రతినిధులు భేటీ కానున్నారు.