తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..లాక్ డౌన్ పొడిగింపు

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 02:26 AM IST
తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..లాక్ డౌన్ పొడిగింపు

Updated On : April 11, 2020 / 2:26 AM IST

తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన కేసులు గత రెండో రోజులుగా 20లోపే నమోదవుతున్నాయి. శుక్రవారం 16కేసులు నమోదుకాగా.. శుక్రవారం 18 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ కేసులు మరిన్ని తగ్గే అవకాశముందని కూడా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో భేటీ కాబోతోంది.

2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనాపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. కరోనా కట్టడికి  ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు.. మునుముందు తీసుకోవాల్సిన చర్యలనూ ఇందులో చర్చించనున్నారు. అంతేకాదు.. లాక్డౌన్ పొడిగింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ లాక్డౌన్ పొడిగించాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రానికి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. లాక్డౌన్ను కొనసాగిస్తేనే మంచిదని ఆయన సూచిస్తున్నారు. నేటి మంత్రిమండలిలోనూ లాక్డౌన్పై చర్చించనున్నారు. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో కరోనా పరిస్థితిపై శుక్రవారం సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడి కాకపోవడంతో.. ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులే నమోదునవుతున్నాయని మరో స్టేజీకి  ప్రబలకుండా కట్టడి చేయడం పై దృష్టి సారించాలని  సూచించారు. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని  ఆదేశించారు. ఇదే సమయంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచేలా దృష్టి పెట్టాలని సూచించారు.

శనివారం ప్రధానమంత్రి మోదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో.. ప్రధానికి వివరించాల్సిన అంశాలపైనా కేసీఆర్ అధికారులతో చర్చించారు. కరోనాతో రాష్ట్రంలో తలెత్తిన పర్యవసానాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా వ్యవహరించాలని మోదీని కోరనున్నారు.