Manik Rao Thackeray : కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ : మాణిక్ రావు ఠాక్రే

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణకి కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.

Manik Rao Thackeray : కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ : మాణిక్ రావు ఠాక్రే

Manik Rao Thackeray

Updated On : February 16, 2023 / 12:52 AM IST

Manik Rao Thackeray : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో, గాంధీభవన్ లోనూ కోమటిరెడ్డి స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ చెప్పిన విషయాన్నే కోమటిరెడ్డి చెప్పానన్నారని ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పారు. బీజేపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిందని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. తెలంగాణలో పొత్తులు ఉండవు.. సింగిల్ గానే అధికారంలోకి వస్తామని చెప్పారు.
నేతలందరూ పార్టీ లైన్ లోనే ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో నేతలంతా పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. ఏ పార్టీకి 60 స్థానాలకు మించి రావని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల పొత్తులపై కోమటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఒంటరిగా అధికారం లోకి రాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తమకు ప్రత్యామ్నాయం లేదని.. మరొకరితో కలవాల్సిందేని చెప్పారు. సీనియర్లు అందరం ఆరు నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి 40-50 స్థానాలు వస్తాయని చెప్పారు. మార్చి 1 నుంచి అందరం కలిసి పార్టీ కోసం ప నిచేస్తామని చెప్పారు.

Manikrao Thakre: మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావ్ థాక్రే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్!

తమతో కలవాల్సిందే కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెసు పార్టీ అని ప్రస్తావించలేదని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ను పొగడటం కేసీఆర్ పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. రాష్ట్రంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని చెప్పారు. అందరూ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని పాదయాత్రలో చేసి తెలంగాణ సాధించుకున్నది ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు .

తెలంగాణకి కొత్త ఇంచార్జ్ గా మానిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో పరిస్థితులు బావున్నాయన్నారు. గత ఇంచార్జ్ ఫోన్ చూసుకునే వారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందని తెలిపారు. సీట్ల కేటాయింపు తమ వారికే ఇవ్వాలనుకుంటే పార్టీ మునుగుతుందన్నారు. గెలిచే వారికి సీట్లు ఇవ్వాలని సూచించారు. మానిక్ ఠాక్రే వచ్చిన తరువాత కాంగ్రెస్ గాడిన పడిందని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఫలితాల తరువాత మరొకరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందే.. జరిగేదే చెబుతున్నానని వెల్లడించారు.

Revanth Reddy : రాష్ట్రంలో సమస్యలన్నీ తీరాలంటే.. కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి-రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఫీల్డ్ లో లేదన్నారు. అధికారంలోకి రాబోమని కాంగ్రెస్ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ ఎక్కడెళ్లిపోయిందని..పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.