TS Corona Update : 24 గంటల్లో 1,028 కరోనా కేసులు, 9 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. పలు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనే కేసుల సంఖ్య వందకు పైగా ఉంది. మిగతా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదువుతుంది. మరణాలు కూడా అదుపులోకి వచ్చాయి.

TS Corona Update : 24 గంటల్లో 1,028 కరోనా కేసులు, 9 మంది మృతి

Ts Corona Update

Updated On : June 26, 2021 / 6:33 PM IST

TS Corona Update : తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,028 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 9 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 054 యాక్టివ్ కేసులున్నాయి.

3 వేల 627 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 132 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6 లక్షల 01 వేల 184గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 15 వేల 054గా ఉంది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –

ఆదిలాబాద్ 05. భద్రాద్రి కొత్తగూడెం 46. జీహెచ్ఎంసీ 132. జగిత్యాల 21. జనగామ 8. జయశంకర్ భూపాలపల్లి 20. జోగులాంబ గద్వాల 05. కామారెడ్డి 01. కరీంనగర్ 58. ఖమ్మం 76. కొమరం భీం ఆసిఫాబాద్ 07. మహబూబ్ నగర్ 18.
మహబూబాబాద్ 53. మంచిర్యాల 42. మెదక్ 05. మేడ్చల్ మల్కాజ్ గిరి 43. ములుగు 27. నాగర్ కర్నూలు 12. నల్గొండ 66. నారాయణపేట 05. నిర్మల్ 02. నిజామాబాద్ 08. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 17. రంగారెడ్డి 64. సంగారెడ్డి 12. సిద్దిపేట 38. సూర్యాపేట 65. వికారాబాద్ 13. వనపర్తి 17. వరంగల్ రూరల్ 24. వరంగల్ అర్బన్ 45. యాదాద్రి భువనగిరి 25. మొత్తం 1,028